Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్ మర్కెట్స్ 11 d ago

8K News-15/04/2025 దేశీయ స్టాక్ మర్కెట్స్ మంగళవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 500 పాయింట్లు పైకెగసింది. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో సెన్సెక్స్ ఉదయం 76,852.06 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 75,157.26) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 76,907.63 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 1577.63 పాయింట్ల లాభంతో 76,734.89 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 500 పాయింట్లు లాభపడి 23,328.55 వద్ద స్థిరపడింది.